డైరెక్టర్ కె ఎస్ రవికుమార్, రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నరసింహ.. ఈ సినిమా విడుదలైన  మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నీలాంబరి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక రమ్యకృష్ణ కూడా అద్భుతమైన నటనతోనే మెప్పించింది. ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర రమ్యకృష్ణ తప్ప మరెవరు కూడా నటించలేరు అన్నట్టుగా నటించింది. అయితే అప్పటికే రమ్యకృష్ణ కూడా టాప్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నది. అయినా కూడా అలాంటి పాత్రలో నటించడం అంటే అది సాహసమే అని చెప్పవచ్చు.



నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్ర గురించి డైరెక్టర్ రవికుమార్ పలు విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. తమిళంలో పలు చిత్రాలలో మొదట ఈయన చిన్న చిన్న పాత్రలలో నటించేవారట. ఆ తర్వాత నెమ్మదిగా డైరెక్టర్ గా పేరుపొంది తమిళంలో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికుమార్ నీలాంబరి పాత్రను ఒక వ్యక్తిని చూసి సృష్టించాను అంటూ తెలియజేశారు. ఆమె ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి అలనాటి హీరోయిన్ జయలలిత అని అంటూ తెలియజేశారు.


1999లో విడుదలైన నరసింహ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా మరింత హైలెట్గా నిలిచింది.. అయితే అప్పట్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఈ సినిమాను చూసి స్పందించింది అని తెలియజేశారు. అయితే ఆ తర్వాత తనని ఏమీ అనలేదని కూడా తెలియజేశారు డైరెక్టర్ కె ఎస్ రవికుమార్. ఇలా వైవిధ్యమైన పాత్రలలో నటించిన రజనీకాంత్ ,రమ్యకృష్ణ మళ్లీ జైలర్ సినిమాలో కూడా అంతే అద్భుతంగా నటించారు. ఇందులో భార్యాభర్తలుగా నటించడం జరిగింది ప్రస్తుతం జైలర్ సీక్వెల్లో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: