
ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, రచ్చ, తడాఖా, ఊపిరి, ఎఫ్ 1 అండ్ 2, సైరా నరసింహ రెడ్డి, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించింది. అయితే గ్లామరస్ హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అందరికీ తెలుసు. వీరిద్దరూ 2023లో లాస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో కలిసి పనిచేశారు. ఈ సిరీస్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. తమన్నా, విజయ్ కూడా వారి ప్రేమ గురించి చాలా సార్లు బయటపెట్టారు. తమన్నా, విజయ్ ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు, కలిసే తిరిగేవాళ్లు.
అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. హీరోయిన్ తమన్నా, విజయ్ కి బ్రేక్ అప్ చెప్పింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినప్పటికి.. తమన్నా కూడా ఈ వార్తలను ఖండించలేదు. ఇక తాజాగా ఓదెల 2 సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక విలేకర్ పరోక్షంగా విజయ్ గురించి అడిగిన ప్రశ్నకి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'మంత్ర, తంత్రాలతో నేను నమ్మను. ఒకవేళ అవి నిజమైతే ముందుగా మీడియాపైనే ప్రయోగిస్తా. అందరూ నేను ఏం చెప్తే అదే రాస్తారు' అని తమన్నా చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ పేరు కూడా పలకడానికి ఆమె ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దీంతో వీరు నిజంగానే విడిపోయారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.