
ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. ఇటీవల మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అంతా ఇంత కాదు. అయితే వారి గోడవలను కవర్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ గోడవల కారణంగా టీవీ 9 ఛానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి చేశారు.
ఆ తర్వాత తప్పు తనదేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు. అయితే ఇటీవల మంచు ఇంట మళ్లీ రచ్చ మొదలైంది. రీసెంట్ గా మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేడు ఉదయం జల్ పల్లి నివాసం వద్ద నిరసన చేపట్టాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఆస్తి వద్దని ఎప్పుడో నాన్నకి చెప్పాను. ఇది ఆస్తి గొడవ కాదు. నా జుట్టు విష్ణు చేతుల్లోకి ఇవ్వడానికి ఇలా చేస్తున్నాడు. ఇంట్లో నా పెంపుడు జంతువులు, ఇతర వస్తువులు ఉన్నాయి. అందుకే వచ్చాను, నాకు ఆస్తి కావాలని కూడా నేను ఏ రోజు అడగలేదు. నా ఇంట్లోకి నన్ను పంపడానికి కూడా ఆర్డర్ అడుగుతున్నారు' అని మనోజ్ చెప్పుకొచ్చారు.