సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి పరిచయం అనవసరం. ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే కంగనా రనౌత్ తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. ఆమె తన ఇంట్లో అసలు ఉండడం లేదని.. అయిన కూడా రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని మండిపడింది. అంత బిల్లు ఎలా వస్తుందని సర్కార్ ని ప్రశ్నించింది. మనాలీలో ఉన్న తన ఇంట్లో అసలు కంగనా ఉండటమే లేదని తెలిపింది. కానీ కరెంట్ బిల్లు మాత్రం రూ. లక్ష వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో పరిస్తితులు ఇలా ఉండడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించింది.
 
తాను అందరినీ ఒక్కటే కోరుకుంటానని.. ఇలాంటి సమస్యలపై అందరం కచ్చితంగా పనిచేయాలని చెప్పుకొచ్చింది. దేశాన్ని, రాష్ట్రాన్ని మంచిగా నడిపించాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆమె అన్నారు. అలాగే ఈ తోడేళ్ళ పాలన నుండి బయట పడలని కంగనా తెలిపింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
 
ఇకపోతే కంగనా రనౌత్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇటీవలే కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 1975 లో ఇండియా ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఒక హిస్టోరీకల్ సినిమా. కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో థియేటర్ లో విడుదల అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ సినిమా మార్చి 14 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ప్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే టాప్ వన్ లోకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని మిలియన్ల వ్యూస్ ని సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: