
గతంలో రేణు దేశాయ్ ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యిందని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఒక అరేంజ్డ్ నిశ్చితార్థం చేసుకొని వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లాలనుకున్నాను కానీ తన పిల్లలకు సరిగ్గా న్యాయం చేయలేక పోతానేమో అంటూ ఆ సమయంలో ఆలోచించి ఆగిపోయానని వెల్లడించింది. నా పిల్లలు ఎదుగుతున్న సమయంలో.. తాను వేరే వాళ్ళతో ఇంకొక జీవితం పంచుకోవాలి అనుకుంటే తన పిల్లలకు పూర్తిగా సమయం ఇవ్వలేకపోతాను అందుకే ఇంకో రిలేషన్ లోకి వెళ్లలేకపోయాను అంటూ తెలియజేసింది.
ఇక తన కూతురు ఆధ్యా 18 ఏళ్లు దాటాక తానంతట తానే అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చిన తరువాత ఆద్య బిజీ అయ్యాక అప్పుడు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానేమో అన్నట్టుగా వెల్లడించింది. అయితే రేణు దేశాయ్ రాబోయే రోజుల్లో రెండవ పెళ్లి చేసుకుని అవకాశాలు కూడా ఉన్నట్లు ఇలా హిట్ ఇచ్చిందని పలువురు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. రేణు దేశాయ్ హీరోయిన్గా సినిమాలకు దూరంగా ఉన్నప్పటి నుంచి మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ తిరిగి పలు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ బాగానే పేరు సంపాదిస్తోంది. మరి మొత్తానికి రెండో పెళ్లి పై మాత్రం క్లారిటీ చేసింది రేణు దేశాయ్.