
ఈ టైం గ్యాప్ లోనే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా హట్ టాపిక్ ఆ వైరల్ గా మారింది . రాజమౌళి తన కెరీర్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు . అన్ని సూపర్ డూపర్ హిట్ కానీ ఆయనకు ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ మాత్రం ఒకటి ఉంది. అదే ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఒకానొక ఇంటర్వ్యూలో రాజమౌళి తన ఫేవరెట్ మూవీ విక్రమార్కుడు అని చెప్పుకొచ్చారు.
విక్రమార్కుడు సినిమాను అసలు అలా తెరకెక్కిస్తానని నేను కూడా ఊహించలేకపోయాను అని.. విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ బహుశా నా ఫ్యూచర్లో కూడా నేను ఎప్పటికి తెరకెక్కించలేకపోవచ్చు అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చారు. విక్రమార్కుడు సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. రవితేజ నటన వేరే లెవెల్ . అనుష్క పెర్ఫార్మన్స్ కెవ్వు కేక అనే చెప్పాలి . అలాంటి ఒక హై లెవెల్ పర్ఫామెన్స్ రవితేజను ఏ సినిమాలో కూడా చూడలేదు . ఈ సినిమా అటు రాజమౌళి - రవితేజ కి అనుష్కకు మంచి ప్రశంసలు దక్కేలా చేసింది..!