బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈమె నటిగానే కాకుండా ఈమె ఎంచుకొనే పాత్రలు కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తూ ఉన్నాయి. ఒకవైపు వ్యాపారం మరొకవైపు సినిమాలు అలాగే సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోకోకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అటు నిర్మాతగా కూడా ఆలియా విజయవంతంగా ముందుకు దూసుకుపోతోంది. గతంలో ఈమె షారుక్ తో కలిసి డార్లింగ్స్ అనే చిత్రాన్ని తీయగా మంచి విజయాన్ని అందుకుంది ఇటీవలే జిగ్రా సినిమాను కూడా నిర్మించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.


అందుకే ఈసారి ప్రత్యేకించి మరి నిర్మాణ విషయంలో సీరియస్ గా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆలియా భట్ పూర్తిగా కొత్త తరహాలో ఒక అడల్ట్ వెబ్ సిరీస్ ని నిర్మించబోతొందట. దీనికి ఎవరు డైరెక్టర్ గా వస్తారు అనే విషయం పైన క్లారిటీ లేదు.. కానీ అడల్ట్ సిరీస్ స్టోరీ  విన్న తర్వాత ఆలియా నో చెప్పలేక పోయిందట. ఈ సిరీస్ లో చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుందని అది అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. rrr చిత్రం ద్వారా భారీ క్రేజీ సంపాదించుకున్న ఆలియా అందుకు విరుద్ధంగా ఇప్పుడు కంటెంట్లను ప్రోత్సహించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఈ బోల్డ్ వెబ్ సిరీస్ తో ఈమె మూడో సినిమాకి నిర్మాతగా అడుగులు వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి మరి కంటెంట్ పరంగా ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో చూడాలి. అలాగే మరొకవైపు నటిగా కూడా తన కెరియర్ పైన ఫోకస్ పెట్టి ఇటు నిర్మాతగా అటు బిజినెస్ వైపుగా అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఇక తన తదుపరి చిత్రం శివ్ డైరెక్షన్లో వస్తున్న స్పై యాక్షన్ సినిమా ఆల్ఫాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి బోల్డ్ వెబ్ సిరీస్ తో ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఆలయ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: