నార్నే నితిన్ .. ఈ పేరు కన్నా కూడా చాలామంది ఎన్టీఆర్ బామ్మర్ది ఎన్టీఆర్ బామ్మర్ది అని పిలుస్తూ ఉంటారు . ఎన్టీఆర్ - నార్నే నితిన్ కి హెల్ప్ చేశాడా..? చేయలేదా..? అన్న విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ఒక మాట కూడా ప్రచారం చేయకుండానే నార్నే నితిన్ లైఫ్ మొత్తం సెట్ చేశాడు. అది నందమూరి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే . జూనియర్ ఎన్టీఆర్ ఏ హీరోకి సపోర్ట్ చేస్తాడు..? ఏ హీరోకి సపోర్ట్ చేయడు..? అనేటివి నందమూరి అభిమానులకి బాగా తెలుసు. ఎన్టీఆర్ భార్య కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అంటే కచ్చితంగా అతగాడిపై ఓ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.


కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నార్నే నితిన్ ని  ఎక్కడ సపోర్ట్ చేయలేదు.. ప్రమోట్ చేయలేదు . ఆయన కష్టంతో ఆయన ఎదగాలి అంటూ కోరుకున్నారు. ఇదే విషయాన్ని ఈవెంట్లో కూడా చెప్పుకు వచ్చారు. కానీ ఎన్టీఆర్ చెప్పిన చెప్పకపోయినా నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ బామ్మర్దిని బాగానే సపోర్ట్ చేశారు . మ్యాడ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా తర్వాత నార్నే నితిన్ కు బడాబడా అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .



ఇదే మూమెంట్లో ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీలో ఛాన్స్ ఇచ్చాడట . జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ స్వయంగా నార్నే నితిన్ ను ఈ క్యారెక్టర్ లో చూపిద్దామంటూ ఎన్టీఆర్ కి ప్రపోజల్ పెట్టారట.  ఎన్టీఆర్ కూడా కష్టపడి పైకి ఎదుగుతున్నాడు ఒక చేయి అందిస్తే ఇంకా బాగా లైఫ్లో సెటిల్ అవుతాడు అంటూ అందుకు ఓకే చెప్పారట.  పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు నార్నే నితిన్ అంటూ ఓ రేంజ్ లో జనాలు మాట్లాడుకుంటున్నారు.  సోషల్ మీడియా లో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: