
అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యం లో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి చిత్ర యూనిట్ పని చేస్తోంది...
ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…ఈ సినిమా ను జులై 24 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఈ నెల 12 వ తేదీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా కు అసలు కారణం.. ఈ సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకి నచ్చకపోవడమే అని న్యూస్ బాగా వైరల్ అవుతుంది..దీనితో కీరవాణి అదిరిపోయే ట్యూన్ సెట్ చేస్తున్నాడు అని.. ఈ సాంగ్ లో మెగాస్టార్ మాస్ వేయనున్నట్లు సమాచారం..