బాలీవుడ్లో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా కనిపిస్తూ ఉంటుంది ఊర్వశీ రౌతేలా.. అయితే ఈ ఏడాది తెలుగులో నటించిన చిత్రం డాకుమహారాజు. ఇందులో బాలయ్య హీరోగా నటించగా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. అంతేకాకుండా బాలయ్యతో కలిసి దబిడి దిబిడి అనే పాటకు స్టెప్పులు వేయడంతో మరింత క్రేజ్ రావడమే కాకుండా ఈ పాటకు విమర్శలు కూడా ఎదుర్కొంది ఊర్వశి రౌతేలా. డాకు మహారాజు చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో కనిపించింది.


ఇదంతా పక్కన పెడితే తాజాగా బాలీవుడ్లో ఈమెకు ఒక అవార్డు సైతం అందుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ 2025 ఎంపికైన ఈ ముద్దుగుమ్మ డాకు మహారాజు చిత్రంతో గోల్డెన్ క్వీన్ అవార్డుల సైతం దక్కించుకున్నది. ఈ విషయం విన్న అటు అభిమానులు కంగ్రాజులేషన్స్ చెబుతూ వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ఊర్వశి సోషల్ మీడియా లేదు కదా పంచుకోవడం జరిగింది. ఇక బాలయ్య అభిమానులు కూడా ఈమెకు సపోర్టు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు.


కేవలం నటించిన ఒక్క తెలుగు సినిమాకే అవార్డు రావడం ఏంటా అని మరికొంతమంది ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఊర్వశికి మాత్రం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినందుకు బాగానే గుర్తింపు సంపాదించుకుందని అభిమానులు కూడా వెల్లడిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు నిరంతరం సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా మారుతూ తన గ్లామర్ ఫోటోలతో స్పెషల్ డాన్స్ ఫోటోలతో హడలెత్తిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో కూడా పలు విభిన్నమైన పాత్రలో స్టెప్పులతో అలరిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజుల్లో కచ్చితంగా పాన్ ఇండియా చిత్రాలు నటిస్తుంది. డాకు మహారాజు సినిమా లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఊర్వశికే ప్రత్యేకంగా గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: