కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి మంచి పేరు సంపాదించారు నటుడు సోనూ సూద్. ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి కూలీలను ఇతర దేశాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా సొంత ట్రావెలింగ్ ఏర్పాటు చేసి మరి తన సొంత ఇళ్లకు సైతం పంపించేలా చేశారు. అంతేకాకుండా వైద్యం అందక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్లందరికీ కూడా అండగా నిలిచారు సోనుసూద్. అలాగే తన భార్యతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేశారు.


గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారని చాలామంది సెలబ్రిటీలకు అధికారులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవలే కోట్లకు కోట్ల రూపాయలు సెలబ్రెటీలు కూడా సంపాదించారని అలాంటి వారిలో విష్ణుప్రియ, రీతు చౌదరి, హర్ష సాయి, చాలామంది బిగ్ బాస్ సెలబ్రిటీలే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఇప్పుడు వీరందరూ కూడా కేసులను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సినీ నటుడు సోను సూద్ పైన కూడా నా అన్వేషణ యూట్యూబర్ పలు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. బెట్టింగ్ స్కామ్ లో ఎన్నో యాప్లను ఈయన ప్రమోట్ చేసి కోట్ల రూపాయలను సంపాదించారంటూ తెలిపారు.


ఇటీవల సోను ఫతే అనే సినిమాను కూడా నిర్మించారు. తనే దర్శకుడు, నిర్మాత ఈ సినిమాకి 50 కోట్లతో తెరకెక్కించగా కనీసం 20 కోట్లు కూడా రాలేదని 30 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటూ తెలిపారు. ఆ డబ్బులు అన్నీ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లే సంపాదించారనే విధంగా నా అన్వేష్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సోను సూద్ కోట్ల రూపాయల సంపాదించడం వెనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఉందని.. తాను చేసే ప్రతి సహాయంలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉన్నదని కావాలంటే ఆయన పాత వీడియోలను ఒకసారి చెక్ చేయాలి అంటూ వెల్లడించారు. హర్ష సాయి తమ్ముడు అయితే సోనూసూద్ అన్న అని బెట్టింగ్ యాప్స్ లలో తెలిపారు అన్వేష్. సోను సూద్ పెద్ద తిమింగలం అంటూ తాజాగా ఒక వీడియోను కూడా వైరల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: