తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన సినిమాలతో ఊపు ఊపిన హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు.. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ పేరు ఇండస్ట్రీలోనే టాప్ లెవెల్ లోకి వచ్చింది. అలాంటి నిత్యా మీనన్ ఇప్పటివరకు చేసిన చాలా సినిమాల్లో ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా జాగ్రత్త పడుతూ  వచ్చింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఫోటో దిగి  కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటుంది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నిత్యామీనన్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ  మొదటి చిత్రంతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. 

ఆ తర్వాత  నితిన్ హీరోగా ఇష్క్ సినిమా లో నటించింది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడంతో వీరికి గుండెజారి గల్లంతయింది అనే సినిమా  వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు తెలుగు, తమిళ్, మలయాళ ఇండస్ట్రీ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అంతే కాదు కొన్ని లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా ఈమె నటిస్తూ  తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. ఇవే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నిత్యామీనన్ దూసుకుపోతోంది.

ఈ విధంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రకటనలు ఇలా అనేక విధాలుగా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న నిత్యామీనన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా నిత్యామీనన్ ఒక సెల్ఫీ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా దాన్ని చూసిన నేటిజన్స్  ఛీ chi అలాంటి చెత్త బ్యాక్ గ్రౌండ్ ఉన్న  ప్లేస్ లో సెల్ఫీ దిగుతావా అంటూ  ఫైర్ అవుతున్నారు. కొంతమంది నీ పక్కన ఎలా చెత్తుందో చూసావా అంటూ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: