తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర వహించే నాయకుల్లో హరీష్ రావు ఒకరు. అలాంటి హరీష్ రావు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఆయన లెవల్  ఏ మాత్రం తగ్గలేదు. ఆ విధంగా హరీష్ రావు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య చిచ్చు పెడుతూ ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మధ్య కాస్త దూరం పెరిగేలా మాటలు మాట్లాడుతూ  ప్రజల్లో కాస్త అసమ్మతి భావం వచ్చేలా చూస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అసహనాన్ని కలిగించి  ప్రజల్లో బ్యాడ్ చేసేలా అనేక ప్లాన్స్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ మాత్రమే గీస్తున్నారని చెప్పవచ్చు. 

ముఖ్యంగా  రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం నమ్మట్లేదని ఒక నినాదాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ మధ్యకాలంలో బీసీల ఉద్యమం అంటూ ఢిల్లీకి వెళ్లారు. కానీ అక్కడ రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో  రేవంత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ అధిష్టానం నమ్మట్లేదని ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు హరీష్ రావు కేటీఆర్. ఇక వీరే కాకుండా  హెచ్సియూ ఉద్యమం సందర్భంగా కొంతమంది విద్యార్థులపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టించారనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదే తరుణంలో భట్టి విక్రమార్క వచ్చి  విద్యార్థులపై పెట్టిన కేసులు తీసివేయాలని మాట్లాడారు.

 ఇలా ఒకే పార్టీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు లీడర్లకు  మధ్య పొసగడం లేదని, సీఎం రేవంత్ రెడ్డిని కాకుండా బట్టి విక్రమార్కను మాత్రమే  రాహుల్ గాంధీ సోనియాగాంధీలు నమ్ముతూ అపాయింట్మెంట్ ఇస్తున్నారని  హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డిని  చాలావరకు డల్ చేసేలా హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తూ గేమ్ ప్లాన్ గిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి పీకేయడానికి అధిష్టానం కసరత్తు లు చేస్తుందని ఒక నినాదాన్ని కూడా హరీష్ రావు ప్రజల్లోకి తీసుకెళ్తూ అసమ్మతి భావాన్ని సృష్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: