
అయితే సిద్దు జొన్నలకొండ అలాగే వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. మన ఇండియాలో.. ప్రీమియర్ షో పడకపోయినా... యూఎస్ క్లోబ్ మాత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో చాలామంది తెలుగు ప్రేక్షకులు యూఎస్ లో ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రివ్యూలు చెప్పేవారు కూడా ఈ సినిమాపై విశ్లేషణ అందిస్తున్నారు.
ట్విట్టర్లో తమకు సీన్ల గురించి అలాగే సాంగ్స్ గురించి రాసుకొస్తున్నారు. ఇక ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ అలాగే కామెడీ బీభత్సంగా ఉందని చెబుతున్నారు. అలాగే రొమాన్స్ తో పాటు దేశభక్తి సీన్స్ కూడా ఉన్నాయట. ఇంటర్వెల్ అయ్యే సరికి దేశభక్తి గురించి ఎమోషన్స్ సీన్స్ కూడా పెట్టారట దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా ఇంటర్వెల్ సమయంలోనే సినిమా ఒక్కసారిగా హైప్ కు వెళ్తుంది అని చెబుతున్నారు.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే... ఫ్యాన్స్ అందరూ డీల పడిపోయే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో సీన్లు సరిగ్గా పెట్టలేదని అంటున్నారు. ఈ సినిమా ఒక్కసారి కుటుంబ సమేతంగా వచ్చి చూడవచ్చని కూడా చెబుతున్నారు. ఈ జాక్ సినిమాను... సగం వండి వదిలేసినట్టు ఉందని కూడా కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ సినిమా కనెక్టివిటీ మిస్ అయిందని అంటున్నారు. ప్రతిసారి వన్ లైనర్ పంచులతో సినిమా వర్కౌట్ అవ్వదని... సెటైర్లు కూడా పేల్చుతున్నారు.