
బన్నీ చాలా నాటి రొమాంటిక్ పాత్రలో మెరిసాడు . అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది కూడా ఈ మూవీనే. కాగా ఈ సినిమాలో ఆయన హీరోయిన్ రంభతో ఒక స్పెషల్ సాంగ్ లో చిందులు వేశాడు. అప్పటివరకు రంభని స్పెషల్ సాంగ్ లో చూపించాలి అని ఎవ్వరు అనుకోలేదు. బన్నీ- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సినిమాలో రంభ స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది . అయితే ఆ తర్వాత వెంటనే రాజమౌళి సైతం జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో ఆమె చేత చిందులు వేయించాడు.
నా చోరే నా చోరే అంటూ రంభ ను ఓ లెవెల్ హై రేంజ్ లో చూపించాడు . రంభ కెరియర్ లో ఈ పాట ఎప్పటికీ స్పెషలే . జూనియర్ ఎన్టీఆర్ సైతం రంభతో అద్దిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేశారు. ఆశ్చర్యమేంటంటే ఎటువంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసే జూనియర్ ఎన్టీఆర్ రంభ డాన్స్ స్టెప్ స్పీడ్ తట్టుకోలేకపోయాను అంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం అప్పట్లో హైలైట్ గా మారింది. ప్రజెంట్ రంభ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ముందుకు వెళుతున్నాడు. త్వరలోనే వార్ 2 సినిమా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు . దేవర 2 కూడా సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ మాత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు . దానికోసం స్పెషల్ డైట్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు చేసుకుంటున్నాడు..!