ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పేరు ఎంతలా మారు మ్రోగిపోయిందో అందరికీ తెలిసిందే. ఏ హీరో చూసిన డైరెక్టర్ చూసిన ఏ ప్రొడ్యూసర్ చూసిన పాన్ ఇండియా .. పాన్ ఇండియా.. పాన్ ఇండియా అంటూ ఓ రేంజ్ లో అల్లాడించేసారు కొంతమంది హీరో. అయితే మంచి కథ కంటెం సినిమాలను స్టార్ హీరోస్ వద్దకు తీసుకెళ్తే నో ఈ సినిమా పాన్ ఇండియా అయితేనే చేస్తామంటూ ముఖానే తేల్చి చెప్పేసారట హీరోలు . అంతలా పాన్ ఇండియా ఒక వైరస్ ల పాకేసింది.


అయితే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన  ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అంటే నో అని చెప్పాలి . ఎంతోమంది స్టార్స్ నటించిన పాన్ ఇండియా సినిమాలు  దారుణతి దారుణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అయితే సింపుల్ కాన్సెప్ట్ సింపుల్ బడ్జెట్ తో తెరకెక్కిన లోకల్ సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  కోట్లకి కోట్లు కోల్ల గొట్టాయి . రీసెంట్ గా వచ్చిన కోర్టు మూవీ ఎంతలా హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలుసు .



సినిమా ఒక సెన్సేషన్ గా మారిపోయింది .కాగా.. మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనేది ఓ నెగిటివ్గా మారిపోతుంది . పాన్ ఇండియా సినిమాలు కొంతమంది డైరెక్టర్లు తెరకెక్కిస్తెనే బాగుంటాయి అని .. అందరికీ అవి వర్క్ అవుట్ కావు అంటూ రియలైజేషన్ కి వచ్చారు.  అంతేకాదు ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు కాకుండా నార్మల్గా లోకల్ సినిమాలను సపోర్ట్ చేయాలి అంటూ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట . త్వరలోనే చాలామంది స్టార్స్ పాన్ ఇండియా మరిచిపోయి నార్మల్ సినిమాలలో కనిపించి మెప్పించాలి అనుకుంటున్నారట. ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఒక బిగ్ ఛేంజ్ వచ్చిన్నట్లే..!

మరింత సమాచారం తెలుసుకోండి: