టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో నటించి అందరిని మెప్పించింది పూనమ్ కౌర్. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు హీరోయిన్ కౌర్. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న పూనమ్ కౌర్... తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టి... రచ్చ చేస్తూ ఉంటారు.


 ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. పరోక్షంగా పోస్టులు పెడతారు పూనమ్ కౌర్. నెలలో కనీసం ఐదు సార్లైనా ఆ ఇద్దరు స్టార్లను.. టార్గెట్ చేసి పోస్టులు పెడతారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరో వివాదాస్పద పోస్ట్ పెట్టారు పూనమ్ కౌర్.  డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు... మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.


 సింగపూర్ లో ఉన్న మార్క్ శంకర్... స్కూలుకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మార్క్ శంకర్ కాళ్లు అలాగే చేతులు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఉపదితులలోకి  పొగ వెళ్ళినట్టు... స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆపదలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులు కూడా.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

 మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని... చెబుతున్నారు. అయితే పూనం కౌర్ మాత్రం.. వివాదాస్పద ట్వీట్ చేశారు.  కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పిచ్చి పోస్టులు ఆమె చేయడం జరిగింది. ఇక ఆ వెంటనే...  చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది... పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు అంటూ చురకలంటించారు. అయితే పూనం కౌర్ చేసిన పోస్టు... ఇప్పుడు వివాదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: