రజినీకాంత్ ఈయన నటన కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. అలాంటి రజనీకాంత్  పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరో. ప్రస్తుతం ఏడు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో దూసుకుపోతూ తనకు ఎదురులేదు అనిపించుకుంటున్నారు. అలాంటి రజనీకాంత్ అప్పట్లో సీఎం జయలలితను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెతో ఆయన విభేదాలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక వేదికగా ఆయన ప్రస్తావించారు. ప్రముఖ నిర్మాత రాజకీయ నాయకుడు అయినటువంటి ఆర్ఎం వీరప్పన్  అంటే తమిళనాడు వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఆర్ఎం వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఆర్వీఎం కింగ్ మేకర్ డాక్యుమెంటరీలో రజినికాంత్ కూడా భాగస్వామ్యం అయ్యారు. 

ఈ సందర్భంగా నిర్మాత వీరప్పన్ తో తనకు ఉన్నటువంటి స్నేహాన్ని మరోసారి గుర్తు చేశారు. వీరి కాంబినేషన్ లో అప్పట్లో భాషా సినిమా వచ్చి 100 రోజుల కంటే ఎక్కువ ఆడింది. అయితే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ ని 1995లో చెన్నై వేదికగా నిర్వహించారు. అక్కడికి వీరప్పన్ కూడా వచ్చారు. సమయంలో ఆయన అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఈ సక్సెస్ ఈవెంట్ లో  రజనీకాంత్ మాట్లాడుతూ  రాష్ట్రంలో బాంబు కల్చర్ బాగా పెరిగిపోయిందని అన్నారట. ఈ మాట అప్పట్లో అన్నా డీఎంకే ప్రభుత్వంలో తీవ్రంగా వైరల్ అయింది.. ఒక సినిమా స్టార్ ఆ విధంగా ప్రభుత్వాన్ని నిందించి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి వీరప్పన్ ఎందుకు నోరువిప్పలేదు అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.

దీన్ని సీరియస్ గా తీసుకున్న జయలలిత  వీరప్పన్ పై వేటు వేసి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ చాలా బాధపడి నావల్ల మీ పదవి పోయింది, నేను జయలలితకు కాల్ చేసి మాట్లాడతా అని చెప్పారట. దానికి వీరప్పన్ నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు నాకు పదవులు అలాంటివి ఏమీ వద్దు అని డైరెక్ట్ గా చెప్పేసారట. ఆ తర్వాత ఆయన సాధారణ జీవితం గడుపుకుంటూ రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయాడని  రజనీకాంత్ చెప్పారు. 30 ఏళ్ల కింద జరిగిన సంఘటన ఆయన మరోసారి గుర్తు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: