రెండు సినిమాలు వేటికవే ఎంతో భిన్నమైనవి ఇంకా చెప్పాలంటే నటీనటులు ప్రొడక్షన్స్ కథపరంగా పోలిక లేని సినిమాలు ఇవి .. కానీ ఇప్పుడు కన్నప్ప , భైరవం మధ్య వ్యత్యాసం చూడాల్సిన పరిస్థితి వచ్చింది .. ఇక దీనికి కారణం కూడా మంచు మనోజ్ అని కూడా చెప్పవచ్చు .. కన్నప్ప సినిమా మీదకు భైరవం సినిమాను వదుల్తానని అనుకుని భయపడ్డాడు .. మగాడిలా వెండితేరపై పోరాడుతామని నా భైరవం సినిమాను పోటీలో ఉంచుదాం అనుకున్నాను .  అంతే టెన్షన్ అయిపోయాడు కన్నప్ప సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు  .  


నిన్న ఉదయం స్వయంగా మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది .. ఇలా మనోజ్ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికి కన్నప్ప సినిమా విడుదల తేదీని ప్రకటించాడు మంచు విష్ణు జూన్ 27న కన్నప్ప సినిమా రాబోతున్నట్లు .. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్మెంట్ చేయించారు.  ఇక మరి ఇప్పుడు మంచు మనోజ్ సంగతి ఏంటి ? మగ్గాడ్ల వెండి తెరపై పోరాడుతామన్న మంచు మనోజ్ కన్నప్పకు పోటీగా అదే డేట్ కి భైరవం సినిమాను రిలీజ్ చేస్తారా ? ఆస‌లీ అంశం మంచు మనోజ్ చేతిలో ఉందా ?


భైరవం సినిమా అనేది మంచు మనోజ్ ఒక్కడికి చేతిలో ఉన్న సినిమా కాదు నిజానికి ఇందులో మెయిన్ లీడ్ మంచు మనోజ్ ఒక్కడే కాదు .. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నారా రోహిత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు .. పైగా నిర్మాత కేకే రాధా మోహన్ చేతిలో ఈ సినిమా ఉంది .. మరి ఇలాంటి సినిమాకు తన వ్యక్తిగత కారణాలు వివాదాలతో మంచు మనోజ్ తనకు నచ్చిన తేదీకి సినిమాను రిలీజ్ చేయగలడా ? ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది .. నిజంగా కన్నప్ప తో పాటు భైరవం రిలీజ్ అయితే నిజంగా బాక్సాఫీస్ వద్ద అసలైన మొగాళ్ళ పోటీ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: