
వివాదాస్పద దర్శకుడి గా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్ వర్మ గత కొంత కాలంగా సరైన సినిమాల ను చేయటం లేదని ఆయన అభిమానులు ఎంతగానో విమర్శిస్తున్నారు .. కాంట్రవర్సీల కి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తో వర్మాత న ట్రాక్ పూర్తి గా తప్పారని కూడా వారు అంటున్నారు .. అయితే గతం లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చినమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే .. క్రైమ్ , హర్రర్ లాంటి జోనర్ లో వర్మ తన సినిమాల తో తన సత్తా చూపించారు .. అయితే ఈసారి హర్రర్ కామెడీ ని జోడించి ఓ సినిమా ని తీసుకురాబోతున్నట్లు వర్మ చెప్పుకొచ్చారు ..
ఇక తన తర్వాత సినిమా హారర్ కామెడీ గా రాబోతుంద ని సత్య , కౌన్ , శూల్ వంటి సినిమా లు తర్వాత విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తో మరోసారి తన సినిమా చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు .. ఇక ఈ సినిమా కథ ను కూడా ఆయన చెప్పుకోచ్చాడు .. ప్రజలకు భయం వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు కానీ అదే పోలీసులకు దెయ్యం కారణంగా భయం వేస్తే .. వారు ఎక్కడికి వెళ్తారు అనేది ఈ సినిమా స్టోరీ గా రానందట . ఇక ‘ పోలీస్ స్టేషన్ మే భూత్ ’ అనే టైటిల్ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు వర్మ .. ఇక ఈ సినిమా లో అదిరిపోయే వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉంటాయ ని వర్మ చెప్పుకొచ్చాడు .. ఇలా మొత్తాని కి తన కెరీర్ లో ఇలాంటి జోనర్ ను ఆర్జీవి తొలిసారి టచ్ చేస్తుండడం తో అభిమానుల్లో ఈ సినిమా పై కాస్త ఇంట్రెస్ట్ మొదలైంది .
After SATYA, KAUN and SHOOL I am thrilled to announce , me and @BajpayeeManoj are once again teaming up for a horror comedy a genre which neither of us did
— ram gopal varma (@RGVzoomin) April 9, 2025
I have done horror , gangster, romantic , political dramas , adventure capers, thrillers etc but never a horror COMEDY…