
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలు చేయడం తో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ‘రాయన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక ఇటీవల ధనుష్ తెరకెక్కించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ థియేటర్స్‌లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది . అయితే ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉన్నాడు .. ప్రస్తుతం తెలుగు దర్శకుడుశేఖర్ కమ్ముల తో కుబేర మూవీ చేస్తున్నాడు ..
అలాగే ఈ సినిమా తో పాటు ‘ ఇడ్లీ కడాయ్ ’ సినిమాల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమా ని ఎవరితో చేయబోతున్నాడు అనే విషయాన్ని కూడా ధనుష్ రివిల్ చేశారు . కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్‌తో గతం లో ‘ కర్ణన్ ’ అనే బ్లాక్ బస్టర్ సినిమా లో నటించాడు ధనుష్ . ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు అధికారికం గా ప్రకటించారు .. ధనుష్ కెరియర్ లోనే 56 వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ను ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా ప్రకటించారు ..
ఇక త్వరలో నే ఓ గొప్ప యుద్ధం ప్రారంభం కాబోతుంది అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ కూడా పెట్టారు .. దీంతో ఈ సినిమా ఎలాంటి బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతుంద నే ఆసక్తి మాత్రం అందరి లో నెలకొంది . ఈ ప్రెస్టీజియస్ సినిమా ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె గణేష్ నిర్మిస్తున్నారు .. ఇక మరి ధనుష్ ఈ సినిమా లో ఎలాంటి పాత్ర లో కనిపిస్తాడు .. మారి సెల్వరాజ్ ఎలాంటి కథ తో రాబోతున్నాడు అనేది తెలియాలంటే మరి కొంత కాలంం ఆగాల్సిందే .