కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘ కూలీ ’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .. ఇక ఈ సినిమా ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెర్కక్కించడం తో ఈ సినిమా పై అంచనాలు భారీ లెవెల్ లో ఉన్నాయి .. ఇక ఈ సినిమా ని కూడా ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ చేస్తున్నారు .. అయితే అదే రోజున బాలీవుడ్ లో తెర్కక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ వార్ 2 కూడా రిలీజ్ కాబోతుంది .. ఇక‌ ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు ..


ఇక దీంతో ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్ క్లాష్ అనివార్యంగా మారునుంది .  కానీ ఈ క్లాష్ వచ్చే ఏడాది కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది .. రజినీకాంత్ త‌న‌నెక్స్ట్ మూవీ గా జైలర్ 2 లో నటిస్తున్నాడు .. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న  ఈ సినిమా షూటింగ్లో కూడా రజిని వచ్చేవారం జాయిన్ కాబోతున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా తన తర్వాత మూవీ దర్శకుడు ప్రసాద్ నీల్‌ డైరెక్షన్లో చేస్తున్నాడు .. అలాగే ఈ సినిమా షూటింగ్లో కూడా ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి జాయిన్ కాబోతున్నాడు .


ఇలా ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలు కూడా 2026 ఏప్రిల్ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి .  ఒక్క వారం రోజుల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ కు దిగిపోతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది .  అంటే 2025 లోనే కాకుండా 2026 లోను బాక్సాఫీస్ దగ్గర రజనీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ జరగనుంది అని కూడా తెలుస్తుంది .. ఇక మరి ఈ వార్తల్లో ఎంతవరకు  నిజం ఉంది  అనేది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: