డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరమైన తర్వాత మళ్లీ సినిమాలకు కం బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా వకీల్ సాబ్ .. అలాగే ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సాలిడ్ హైప్‌ మధ్య కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా రికార్డ్స్ ఓపెనింగ్స్ అందుకుంది .. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ సహా అభిమానులు కూడా మరోసారి పాత రోజులను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు ..


అలాగే ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ .. ఈ  సినిమా విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడు .. అలాగే ఒక స్పెషల్ వీడియో కూడా షేర్ చేసుకుని మొదటిసారి పవన్ తో చేసిన వకీల్ సాబ్ సినిమా తన కెరీర్ లోని ఎంతో ప్రత్యేకమైనదని అందుకు పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారికి అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వకీల్ సాబ్ సినిమాలో తన జర్నీ పట్ల ఎమోషనల్ గా తన ఆనందం వ్యక్తం చేశాడు తమన్ .  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండగా ఆయన చేయబోయే సినిమాలపై కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .


 అలాగే వచ్చే నెలలో పవన్ హరిహర వీరమల్లు ప్రేక్షకులు ముందుకు రానుంది .  అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు .. అలాగే ఈ సినిమానే పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అని కూడా అంటున్నారు .. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో పలు గాయాలు అవ్వగా అక్కడ హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్నాడు  . ఇక ప్రస్తుతం పవన్ కూడా సింగపూర్ లోనే ఉన్నాడు .



మరింత సమాచారం తెలుసుకోండి: