కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికి ఓవర్సీస్ లో కూడా మొదటి ఆట పూర్తి కావడంతో పలువురు నేటిజన్స్ అభిమానులు కూడా తమ సోషల్ మీడియా వేదికగా రివ్యూలను పంచుకుంటూ ఉన్నారు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోని నిర్మించారు. అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. మరి తాజాగా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.



సినిమా చూసిన అభిమానులు సినిమా సూపర్ అంటు తెలియజేస్తున్నారు. పూర్తిగా మాస్ ఎంటర్టైన్మెంట్గా డైరెక్టర్ అధిక రవిచంద్రన్ తెరకెక్కించారని చాలా ఏళ్ల తర్వాత అభిమానుల కోసం ఒక బెస్ట్ సినిమా అజిత్ ఇచ్చారు అంటూ కూడా కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ కేవలం అజిత్ పాత్రను మాత్రమే ఈ సినిమాలు చక్కగా చూపించారు త్రిష, సిమ్రాన్లు ఇద్దరూ కూడా ఈ సినిమాలో పెద్దగా ప్రభావం చూపించలేదంటూ మరి కొంతమంది నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీరిద్దరూ సినిమాలో ఉండడం అనవసరం అంటూ తెలుపుతున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మొదటి భాగం అజిత్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ తీశారని భారీ యాక్సిడెంట్ సీన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం లాస్ట్ అవుతుందని అజిత్ కెరియర్ లోనే ఒక బెస్ట్ గా ఈ సినిమా ఉంటుందంటూ తెలుపుతున్నారు. స్టోరీ పరంగా కథ నెమ్మదిగా మొదట సాగుతుందని తెలుపుతున్నారు మ్యూజిక్ జీవి ప్రకాష్ అద్భుతంగా అందించారని ప్రతి సన్నివేశం కూడా ఎలివేషన్ హైలెట్గా నిలుస్తోందని అభిమానులు వెల్లడిస్తున్నారు. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: