
అందుకే తెలుగులో ఉన్న కొంతమంది హీరోలు తమిళ దర్శకుల పేరు చెబితేనే భయపడుతున్నారు .. కానీ ఇంత భయం లోను అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు .. అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా వెలబోతుంది .. అయితే అట్లీ ట్రాక్ రికార్డ్ ఎంతో సూపర్ ఈ విషయంలో ఎలాంటి తిరుగులేదు కానీ తెలుగు ప్రేక్షకులకు గత అనుభవాలు పీడకలలా ఉన్నాయి . ముఖ్యంగా కోలవుడ్ దర్శకులు తెలుగు హీరోల ఇమేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని అసలు అర్థం చేసుకోరు పట్టించుకోరు. అందుకే కోలీవుడ్ దర్శకులు చేసిన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి అంటూ వారు భయపడుతున్నారు .. అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను మార్చాల్సిన బాధ్యత అట్లీపై ఎంతగానో ఉంది .
ముఖ్యంగా తమిళ దర్శకుల దగ్గర ఉన్న మరో సమస్య ఏమిటంటే మీరు తెలుగు రచయితలతో , టెక్నీషియన్స్ తో వర్క్ చేయడానికి అసలు ఆసక్తి చూపించరు దాంతో తెలుగు ప్రేక్షకుల పల్స్ వీరికి అసలు అర్థం కాని పరిస్థితిగా మారింది. గేమ్ చేంజర్ విషయంలోను ఈ తప్పు జరిగింది ఈ సినిమాకు బుర్రా నరసింహా సంభాషణలు అందించారు. కాకపోతే.. ఆయన అనువాదకుడు మాత్రమే. తమిళ సీన్‌ని ఆయన తెలుగులో తర్జుమా చేశారు. దాంతో.. తెలుగు నేటివిటీ, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి పెద్దగా అవి పట్టలేదు. ఇప్పుడు అట్లీ ఏం చేస్తాడో చూడాలి. ‘పుష్ప 2’ తరవాత చేస్తున్న సినిమా ఇది . కాబట్టి బన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే .