
మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మహేష్. ఆ తర్వాత రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కూడా జనాల దృష్టిని ఆకర్షించింది. అయితే సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగం కావడం కొసమెరుపు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫస్ట్ టికెట్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈ మేరకు ప్రదీప్, కమెడియన్ సత్యలతో కలిసి ఓ ఫన్నీ ప్రమోషనల్ వీడియో కూడా చేసారు.
సదరు వీడియోని ఒకసారి గమనిస్తే... హీరో ప్రదీప్ ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ ను గ్లోబల్ స్టార్ చేతిలో పెట్టాలని చూడగా, చెర్రీ ఇంట్లో వంట మనిషి భర్త రికమండేషన్ తో ఆయన అపాయింట్మెంట్ సాధిస్తారు. అయితే అక్కడికి వచ్చిన చరణ్.. ప్రదీప్ ని గుర్తు పట్టి సత్యని గుర్తు పట్టనట్టుగా బిహేవ్ చేస్తాడు. ఫస్ట్ టికెట్ మాత్రమే తాను కొంటానని, మిగిలిన కలెక్షన్స్ ప్రజలు ఇస్తారని రామ్ చరణ్.. చెబుతూ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో సత్య థ్యాంక్స్ చెబుతూ చెర్రీ కాళ్లు మొక్కగా.. వెంటనే సత్య కాళ్లకు చరణ్ నమస్కరిస్తాడు. దీంతో పక్కనే ఉన్న ప్రదీప్ విరగబడి నవ్వడం మనం గమనించవచ్చు. దాంతో ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంత పెద్ద హీరో అయ్యుండి అలా చేయడం చెర్రీ సింప్లిసిటీకి నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.