
ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి నెలలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేయడం జరిగింది. దానికి గల కారణం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమిటంటే... ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉండగా... సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన ట్యూన్ విషయంలో చిరు కాస్త అసంతృప్తి చెందారట. ఆ కారణంగానే సినిమా కాస్త ఆలస్యమవుతున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మరో ట్యూన్ రెడీ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ మాస్ కి కావలసిన స్పెషల్ స్టెప్స్ వేయబోతున్నట్టు సమాచారం.
కాగా విశ్వంభర సినిమా నుంచి గత కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దానికి కారణం లేకపోలేదు... విశ్వంభర గ్లింప్స్ ద్వారా వచ్చిన నెగెటివిటీతో టీం అంతా మళ్లీ ప్యాచ్ వర్క్‌లో బిజీగా పడ్డట్టు సమాచారం. మరీ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల్ని మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనుల మీద మళ్లీ వశిష్ట కూర్చున్నాడని, అందుకే చాలా ఆలస్యం అవుతూ వస్తోందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఈఏడాదిలోనే ఈ సినిమా రావాలని మెగాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు... విశ్వంభర సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇంద్ర రిలీజ్ అయిన డేట్‌ను సెంటిమెంట్‌గా పెట్టుకుని విశ్వంభరను విడుదల చేయాలని అనుకుంటున్నారని వినికిడి.