- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలో అఖండ 2 కూడా ఒకటి .. ఈ సినిమా ను గతంలో వచ్చిన అఖండ సినిమా కు సీక్వల్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెర్కక్కిస్తున్నారు .  అయితే ఈసారి అఖండ 2 బోయపాటి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .  అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది .. ఇదే క్రమంలో ఈ సినిమా పై కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా తెగ వినిపిస్తున్నాయి .  ఇదే క్రమంలో బాలకృష్ణ దర్శకుడు బోయపాటికి పడటం లేదని షూటింగ్ అంతా సజావుగా జరగటం లేదంటూ కొన్ని రూమర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి ..


అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా తెలుస్తుంది .. ఈ సినిమా షూటింగ్ మొత్తం అనుకున్నట్లే జరుగుతుంది .. ప్రధానంగా బాలకృష్ణ కూడా బోయపాటి చెప్పిన విధంగా సినిమా చేస్తున్నాడు .  బోయపాటి కూడా ఈసారి బాలకృష్ణ తో పాన్ ఇండియా స్థాయిలో తన నాలుగో విజయాన్ని ఊహించిన రేంజ్ లో అందుకోవాలని ప్లాన్ లో ఉన్నాడు .  అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా అసలు బయటికి రాకుండా సినిమాను ఎంతో  పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు .  అయితే ఇప్పుడు బాలయ్య , బోయపాటి మధ్య విభేదాలు వచ్చేయి అనేదాంట్లో ఎలాంటి నిజం లేదని కూడా తెలిపోయింది .. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు .  అలాగే 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: