టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమా తో తెలుగులో మంచి క్రేజ్‌ తెచ్చుకొని గ్లామర్ బ్యూటీ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. అతి చిన్న వయసులో నే చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది .. తెలుగు , హిందీలో పలు సినిమాలో నటించి మెప్పించింది ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది .. తనే హీరోయిన్  అయేషా టాకియా .. ఇక ఈరోజు ఈ హీరోయిన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈమెకు సోషల్ మీడియా వేదికగా బర్తడేే విషెస్ చెబుతున్నారు ఆమె అభిమానులు .. అయితే ఇప్పటికీ ఈమె ట్రోలింగ్ భరించలేక అయేషా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే ..


అయితే ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది .. ఎక్కడ ఉంది అనే విష‌య‌లు ఇక్కడ చూద్దాం .. ‘టార్జాన్: ది వండర్ కార్’, వాంటెడ్ వంటి సినిమాలో నటించి భారీ క్రేజ్ తెచ్చుకున్న ఆయేషా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది . ఇక ఆయేషా 2004లో టార్జాన్ ది వండర్ కార్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది .. ఇక తన అమాయకమైన పేస్ తో సహజమైన నటనతో అభిమానులను ఎంతగానో మెప్పించింది .. సోచా నా థా’, ‘దిల్ మాంగే మోర్’, ‘షాదీ సే పహెల్’, ‘నో స్మోకింగ్’, ‘పాఠశాల’, ‘వాంటెడ్’ వంటి పలు సినిమాల్లో నటించి ఎంతో ఫేమస్ అయ్యింది .. అలాగే 23 సంవత్సరాల వయసులోనే ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుందిఫర్హాన్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు .


 ఇక పెళ్లి తర్వాత ఆయేషా ఇస్లాం మతంలోకి మారి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటుంది .. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయేషా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కూడా తెలుస్తుంది .. సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది ఇక ఇటీవల ఆమె లుక్స్ గురించి కూడా సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరిగింది .. ఇక దీంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేసింది .. కానీ ఆ తర్వాత మళ్లీ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా మారింది .. అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా అందులో పంచుకుంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: