ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే టాలెంట్ ఉంటేనే రాణించడం కష్టం. వీటికి తోడు అదృష్టం అనేది కూడా ఉండాలి.. కొంతమంది దర్శకుల దగ్గర మంచి మంచి కథలు ఉన్నప్పటికీ స్టార్ హీరోల డేట్స్ దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఇతర హీరోలతో కూడా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి కొన్ని సందర్భాలలో డేట్లు అడ్జస్ట్ కాక ప్రాజెక్టు ఆగిపోయినవి కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు టాలీవుడ్లో ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పరిస్థితి ఇలానే మారిపోయింది. ఇక ఆ డైరెక్టర్స్ ఎవరో కాదు డైరెక్టర్ క్రిష్, మరో డైరెక్టర్ హరి శంకర్.


హీరో పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చినప్పటికీ ఎందుకో పూర్తి చేయలేకపోయారు. అలాగే డైరెక్టర్ క్రిష్ కూడా హరిహర వీరమల్లు సినిమాని తెరకెక్కించే అవకాశం ఇచ్చారు. డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటారు అనుకున్నప్పటికీ చాలాసార్లు షూటింగు వాయిదా పడడంతో కొంతమేరకు బాగానే డైరెక్టర్ క్రిష్ పూర్తి చేసిన తర్వాత కొన్ని కారణాల చేత తప్పుకున్నారట దీంతో ఈ సినిమాని నిర్మాత Am రత్నం కుమారుడు జ్యోతికృష్ణ కంటిన్యూ చేశారు.


ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్, అనుష్కతో ఘాటి చిత్రాన్ని తెరకెక్కించారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కానీ సినిమాకు సంబంధించి కొంతమేరకు షూటింగ్ చేసి గ్లింప్స్ విడుదల చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి భారీగానే క్రేజ్ ఏర్పడింది.. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డేట్లు అడ్జస్ట్ కావకపోవడంతో పాటుగా పొలిటికల్ పరంగా బిజీగా ఉండడంతో హరిశంకర్ రవితేజ తో కలిసి ఒక సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా హరిశంకర్ క్రేజ్ పడిపోయింది. అలా ఉస్తాద్ ప్రాజెక్టు కూడా వెనుకబడిపోయింది. ఈ ఇద్దరు డైరెక్టర్లకు అదృష్టం వరించిందనే ఆనందించే లోపు అది చేజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: