
మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ చేత ప్రశంసలు అందుకున్నారు. తాను సినిమాలలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక క్యారెక్టర్లలో యాంథోని నటించారని కామెడీ క్యారెక్టర్ మాస్ ఎంట్రీగా చూపించారని అది కూడా సినిమాకి హైలైట్ గా ఉందని తెలిపారు ఎన్టీఆర్.యాంథోని అసలు పేరు మాత్రం రవి అట సినీ ఇండస్ట్రీలో ఈయన ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేదట.. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలాంటి చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేసే అవకాశం కల్పించారట.
యాంథోని ఇప్పటివరకు తెలుగులో ఏడు చిత్రాలలో పనిచేయడమే కాకుండా నటుడుగా కూడా నటించారు. మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కూడా రవిని చూసి ఒక క్యారెక్టర్ ని రవి చేత చేయించారు. అలా మ్యాడ్ సినిమాలోని పాత్ర యాంథోని హైలెట్గా నిలిచింది. దీంతో మాడ్ స్క్వేర్ లో కూడా రవిని కంటిన్యూగా చేశారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. మరి ఈ సినిమా తరువాత మరిన్ని చిత్రాలు తెలుగులో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఫంకీ అనే ఒక సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.