
డాకు మహారాజు చిత్రంతో నిర్మాతకు ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయితే సాధించారు.. థియేటర్ రైట్స్ దక్కించుకున్న వారికి మాత్రం కొంతమేరకు నష్టం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య కెరియర్ లోనే వరుసగా విజయాలు అందుకున్నారు బాలయ్య. అయితే ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన ఊర్వశి రౌతేలా తన అద్దంతో అదిరిపోయే ఫిజిక్కుతో అందరిని తన వైపు తిప్పుకుంది. అలాగే బాలకృష్ణతో కూడా అదిరిపోయే స్టెప్పులు వేయడంతో దబిడి దిబిడి పాటకు భారీగా ఈమెకు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అలాగే ఈ పాటకి ఎక్కడ చూసినా కూడా రీల్స్ చేస్తూ తెగ వైరల్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.
ఇంటర్నేషనల్ లెవల్లో కూడా దబిడి దివిడి సాంగ్ కు అక్కడక్కడ స్టెప్పులు వేస్తూ ఉన్నది. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం పొగడ్తలతో బాలకృష్ణ అని పొగిడేస్తూ అభిమానుల చేత ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. అలాగే వచ్చిన అవకాశానన్న ఉపయోగించుకొని ఐటెం సాంగ్ కూడా చేస్తూ భారీగా క్రేజీ పెంచుకునేలా చేసింది. దబిడి దిబిడి సాంగ్కు కూడా విమర్శలు వినిపించిన వాటి గురించి అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఊర్వశి రౌతేలా మరిన్ని అవకాశాలు అందుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.