
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఈ చిత్రానికి నాగచైతన్య 24 అనే వర్కింగ్ టైటిల్ తో తీయబోతున్నారు. హీరోయిన్గా ఎవరు నటిస్తారని విషయానికి వస్తే... నాగచైతన్యకు జోడిగా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో భారీ విజయాలను కూడా అందుకొని సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ అందుకున్నది.
ముఖ్యంగా యంగ్ హీరోలకు ఛాయిస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అక్కినేని నాగచైతన్యకు జోడిలా నటిస్తుందని తెలిసి అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా మీనాక్షి చౌదరి కూడా తన పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోందని అభిమానులు తెలియజేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా నాగచైతన్య, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చే సినిమా హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య 24వ సినిమా షూటింగ్ ఏప్రిల్ 14 నుంచి మొదలు కాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో నాగచైతన్య చూడాలి.