గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చి బాబుసన దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ తో ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్కు మాట్లాడే స్వాగ్, డైలాగ్ డెలివరీ కూడా ప్రేక్షకులకు అభిమానులను ఆకట్టుకున్నాయి. పెద్ది సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా యాంకర్ ప్రదీప్ కమెడియన్ సత్య ఇద్దరు కలిసి హీరో రామ్ చరణ్ ని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రమోషన్స్ లో భాగంగా కలవడం జరిగింది.



యాంకర్ ప్రదీప్, దీపిక పెళ్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తో మొదటి టికెట్ కొనిచ్చారు.అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది ఇందులో రామ్ చరణ్ ను కలిసేందుకు అటు ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్యా కూడా వెళ్ళగా.. కమెడియన్ సత్య చరణ్ నాకు బాగా క్లోజ్ నేను ఎంత చెబితే అంత అంటూ చెప్పే డైలాగులు కామెడీగా నవ్విస్తున్నాయి.


అయితే చివరికి చరణ్ మాత్రం అసలు సత్య ఎవరో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. సత్య ను కిషోర్ అంటూ కూడా రామ్ చరణ్ ఆట పట్టించిన సందర్భాల్లో ఉన్నాయి. ఆ తర్వాత సినిమా టికెట్ కొన్న తర్వాత రామ్ చరణ్ కాళ్లకు నమస్కరించినటువంటి సత్య తిరిగి రామ్ చరణ్ కూడా సత్యకాలలో మొక్కేందుకు ప్రయత్నించగా వెంటనే సత్య పక్కకు జరిగారు అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. మొత్తానికి గ్లోబల్ స్టార్ అయ్యుండి కూడా ఇంత సింపుల్ తో ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: