సౌత్ స్టార్ హీరో సూర్య కంగువా సినిమాతో అభిమానులను భారీగా నిరాశపరిచారు .. అయితే ఈసారి మాత్రం అభిమానుల కాలురెగరేసే మూవీని ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న రెట్రో తో గట్టి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు .. అలాగే బాక్సాఫీస్ లెక్కలు కూడా సరి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూర్య .. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేసాయి .. ఇక రెట్రో మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 1న‌ ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది ..


అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 18న చెన్నైలో ఎంతో గ్రాండ్గా నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది . అలాగే ఈవెంట్ కు గెస్ట్ గా సూపర్ స్టార్  రజినీకాంత్ రాబోతున్నారని తమిళ సర్కిల్స్ లో బజ్‌ నడుస్తుంది .. అప్పుడే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట .. ఇక రెట్రోకు సంతోష్ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు . గ్యాంగ్ స్టార్  బ్యాక్ డ్రాప్ లో వస్తున్న retro ను స్టోన్ బెంజ్ క్రియేషన్స్ 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కార్తీక్ సుబ్బరాజు , సూర్యా, జ్యోతిక కార్తికేయన్ సంతానం సంయుక్తంగా నిర్మిస్తున్నారు .  


దాదాపు 65 కోట్ల తో వస్తున్న రెట్రో డిజిటల్ టెలివిజన్ రైట్స్ అన్నీ కూడా ఊహించని రేటుకు అమ్ముడై పోయి అన్నది కోలీవుడ్ టాక్  దాదాపు 80 కోట్లు వెచ్చించి ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూర్య లుక్స్ పై కూడా సినిమా అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రజెంట్ ఫెయిల్యూర్ తో సతమతమౌతున్న సూర్య , పూజ హెగ్డేలకు ఈ సినిమా ఎంతో కీలకం .. ఇక మరి ఇద్దరికీ కార్తీక్ సుబ్బరాజు సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: