నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. తాజాగా అఖండ సీక్వెల్ అఖండ 2 తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. సంయుక్తమీనన్ కూడా ఇందులో నటిస్తోంది. అఖండ సినిమా మొదట తెలుగులో విడుదలవ్వగా ఆ తర్వాత పలు భాషలలో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఓటీటిలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నది. అఖండ 2 కి సంబంధించి పలు కీలకమైన సన్నివేశాలను కూడా చిత్ర బృందం చిత్రీకరిస్తూ ఉన్నారు.


ప్రస్తుతం రెండో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే బాలయ్య బోయపాటి శ్రీను మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తాయని వీరిద్దరి మధ్య మాటలు లేవనే విధంగా సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య ఎప్పుడు కూడా డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తూ సినిమాలను చేస్తూ ఉంటారు. అఖండ 2 సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.. కానీ బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు వచ్చాయనే విషయాన్ని అభిమానులు ఖండిస్తున్నారు.


ఎందుకంటే వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏం చెబితే బాలయ్య అందుకు చేసేందుకు సిద్ధంగానే ఉంటారు. ఒకసారి బాలకృష్ణ కథ విని స్క్రిప్ట్ ఫైనల్ చేశారంటే మాత్రం ఎవరు ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు. అందుకే బాలకృష్ణతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సినిమా ఫలితాలను అసలు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు బాలయ్య. ఇప్పటివరకు బాలకృష్ణ డైరెక్టర్లతో గొడవలు పడిన సందర్భాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. సినిమా అయిపోయిన తర్వాత చాలామంది దర్శకలు, నిర్మాతలు కూడా బాలయ్య  డెడికేషన్ కి మెచ్చుకుంటూ మరి ప్రశంసిస్తూ ఉంటారు. మరి బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు అనే విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: