గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు. ముఖ్యంగా  కొడుకులకు మరియు తన తండ్రికి మధ్య ఈ వార్ చివరికి మీడియా వరకు వచ్చింది. మీడియాపై కూడా మంచు ఫ్యామిలీ దాడి చేయడంతో అది పెద్ద వివాదం అయింది. మోహన్ బాబు  మీడియా వారికి సారీ చెప్పి తప్పు అయిందని ఒప్పుకున్నారు. అలా వీరి వివాదం కొనసాగుతున్న తరుణంలో తాజాగా మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని మీడియా ఎదుట బయటపెట్టారు. మా కుటుంబంలో జరుగుతున్నది ఆస్తి తగాదా కాదని, కానీ చాలామంది ఆస్తుల వల్లే గొడవలు వస్తున్నాయని చెబుతున్నారు అందులో నిజం లేదని చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో కొంతమంది చేసిన పనుల వల్లే నా మనసు విరిగిపోయిందని అన్నారు. 

విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసమే  నేను మాట్లాడానని  అక్కడి నుంచి గొడవలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. నేను ప్రశ్నిస్తున్నందుకే నా గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటివరకు నాపై 30 వరకు కేసులు పెట్టారని, మా కుటుంబం కోసం నేను ఎంతో చేశానని అసలు ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా నేను కావాలని కోరుకోవడం లేదని చెప్పారు. మా నాన్న సినిమాలన్నింటికీ మా అన్నకు సంబంధించిన సంస్థలే పని చేస్తాయి సన్నాఫ్ ఇండియాలోని ఒక పాట గ్రాఫిక్స్ కు సుమారు కోటిన్నర ఖర్చు చేసామని అన్నారు.

అంతేకాదు ఈ గొడవలు జరుగుతున్న సమయంలో అందులోకి నా  భార్యను లాగారు, తన వల్లే కుటుంబమంతా చెడిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ లో నా భార్యాబిడ్డల పేరు కూడా చేర్చడంతో నా మనసు విరిగిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు ఆస్తులు అడగలేదు కాబట్టి నేను ఎక్కడ భయపడనని మనోజ్ తెలియజేశారు. నేను పాప పుట్టినరోజు వేడుకలకు సంబంధించి జైపూర్ వెళ్లిన సమయంలో  తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం జలపల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: