
సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు వర్మ పస అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆర్జీవీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో షాకింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ‘‘సత్య, కౌన్ స్కూల్ తర్వాత నేను ఈ సినిమా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నేను, బాజ్‌పేయి మనోజ్ మేమిద్దరం చేయని హార్రర్ కామెడీ జానర్ కోసం మరోసారి జత కట్టడం ఇంకా ఆనందంగా వుంది. నేను హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌లు మొదలైనవి చేసాను. కానీ ఎప్పుడూ హార్రర్ కామెడీ చేయలేదు. ఇపుడు ట్రై చేస్తున్నాను." అని చెప్పుకొచ్చారు.
కాగా... ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో అని పెట్టడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా మెయిన్ థీమ్ గురించి వర్మ మాట్లాడుతూ... మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తాం అని చెప్పుకొచ్చారు. ఓ ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారుతుంది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తూ వుంటారు. అత్యాధునిక VFX, చిల్లింగ్ హర్రర్ ఎఫెక్ట్‌లతో, పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్ మిమ్మల్ని భయ భ్రాంతులకు గురిచేసే వినోదభరితమైన చిత్రం అవుతుంది! అని చెప్పుకొచ్చారు వర్మ.