
ఒకప్పుడు స్టార్ హీరోలకు వారి కేరీర్ లోనే బిగ్గెస్ట్ విజయాలు ఇచ్చిన పూరి ఇప్పుడు తాను ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు . లైగర్ , డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ప్లాప్ అవటంతో తర్వాత సినిమా కోసం పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాడు .. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా ప్రకటించిన పూరి చెన్నైలోనే ఉంటూ సినిమాకు వర్క్ చేస్తున్నాడు . ప్రధానంగా సినిమా అవకాశాల కోసం తాను కష్టపడుతున్న సమయంలో ఎలాంటి లైఫ్ స్టైల్ చూశారో ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నాడు రోడ్ సైడ్ టీ స్టాల్ లో టీ టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఆ విశేషాలు అభిమానులతో పంచుకుంటున్నాడు ..
అలాగే చిత్ర పరిశ్రమ గురించి పూరి తీసిన సినిమా నేనింతే కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా టాలీవుడ్ క్లాసిక్ లో మంచి సినిమాగా నిలిచింది .. అలాగే ఈ సినిమా లో తాను రాసిన డైలాగ్స్ మళ్లీ గుర్తు చేసుకుంటున్నాడు పూరి . అందుకే తన చేతి మీద నథింగ్ పర్మనెంట్ అన్న టాటూ తో ఈ సిచువేషన్ నుంచి త్వరలోనే బయటకు వస్తానని చెప్పకనే చెబుతున్నాడు .. ఇక మరి నిజంగానే పూరి బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది కాలమే చెప్పాలి ...