
ఈ సినిమా ముఖ్యంగా పోక్సో చట్టం గురించి లోతుగా తెలిజేయడం కోసం తీసింది. కోర్ట్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. సెకండాఫ్ మొత్తం కోర్ట్ సీన్స్ ఉంటాయి. సినిమాలో చందు పాత్రలో రోషన్, జాబిలి పాత్రలో శ్రీదేవి బాగా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాలో ప్రేమించుకుంటారు. మంగపతి అనే బలమైన పాత్రలో శివాజీ కనిపించారు. మంగపతి, శ్రీదేవి మేనమామ.. చందుపైన పోక్సో కేసు పెడుతాడు. లాయర్ కి అసిస్టెంట్ గా తేజ అనే పాత్రలో ప్రియదర్శి చందుపైన పెట్టిన తప్పుడు కేసును ఎలా ముగిస్తాడానేదే ఈ సినిమా కథ. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి పోక్సో చట్టం అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమాకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. ఇక కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ సినిమాకు 2.75 రేటింగ్ వచ్చింది.
కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. కోర్ట్ మూవీ త్వరలో ఓటీటీలోకి రిలీజ్ అవ్వనుంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఈ నెల 11న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.