థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరో నాని నిర్మాతగా కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ అనే సినిమాను తెరకెక్కించారు. కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.  కోర్ట్ మూవీ త్వరలో ఓటీటీలోకి రిలీజ్ అవ్వనుంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఈ నెల 11న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.  ఈ సినిమాలో రోషన్, శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే నటుడు ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ సహాయక పాత్రలను పోషించారు. కోర్ట్ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చితే.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సినిమా ముఖ్యంగా పోక్సో చట్టం గురించి లోతుగా తెలిజేయడం కోసం తీసింది. కోర్ట్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. సెకండాఫ్ మొత్తం కోర్ట్ సీన్స్ ఉంటాయి. సినిమాలో చందు పాత్రలో రోషన్, జాబిలి పాత్రలో శ్రీదేవి బాగా నటించారు. వీరిద్దరూ ఈ సినిమాలో ప్రేమించుకుంటారు. మంగపతి అనే బలమైన పాత్రలో శివాజీ కనిపించారు. మంగపతి, శ్రీదేవి మేనమామ.. చందుపైన పోక్సో కేసు పెడుతాడు. లాయర్ కి అసిస్టెంట్ గా తేజ అనే పాత్రలో ప్రియదర్శి చందుపైన పెట్టిన తప్పుడు కేసును ఎలా ముగిస్తాడానేదే ఈ సినిమా కథ. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి పోక్సో చట్టం అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమాకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. ఇక కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ సినిమాకు 2.75 రేటింగ్ వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: