చాలా రోజుల నుండి సమంత గురించి రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సమంత రెండో పెళ్లి వార్తలు అంత గట్టిగా వినిపిస్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడం లేదు అంటే సమంతకు ఎక్కడో ఆయనపై ఇష్టం ఉందనే అర్థం చేసుకోవచ్చు.ఎందుకంటే కొంతమంది నటీనటులు వారి మీద ఏదైనా దుష్ప్రచారాలు జరిగితే,రూమర్లు వినిపిస్తే వెంటనే వాటిని ఖండించడం గానీ లేదా పరోక్షంగా పోస్టులు పెట్టి వాటికి చెక్ పెడుతూ ఉంటారు.కానీ సమంత ఇప్పటివరకు రెండో పెళ్లి వార్తల గురించి స్పందించి అదంతా రూమర్లే అని చెప్పింది లేదు..ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం గట్టిగానే సాగిస్తుందని బాలీవుడ్ మీడియా టాక్.అంతేకాదు ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ కూడా సమంత ప్రేమ వార్తలు ఎక్కువగానే ప్రచారం చేసినప్పటికీ సమంత వీటిని పట్టించుకోవడం లేదు. పార్టీలు, పబ్బులు, పికిల్ బాల్ కాంపిటీషన్ ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా రాజ్ నిడిమోరుని వదిలి పెట్టకుండా పబ్లిక్ గానే ఆయన చేతులు పట్టుకొని క్లోజ్ గా ఉంటూ అందరికీ మరింత అనుమానం పుట్టించేలా చేస్తుంది.

అయితే తాజాగా సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్లు మరోసారి ఊపందుకున్నాయి.ఇక రీసెంట్ గానే తన మాజీ భర్త పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఆయన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నేనెందుకు ఆ బాధను మోస్తూ ఒంటరిగా ఉండాలి. బాధను పంచుకుంటేనే తగ్గుతుంది అని నిర్ణయించుకున్న సమంత తాను ఎంతో సన్నిహితంగా మెదులుతున్న రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అతి త్వరలోనే రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి సమంతని రెండో పెళ్లి చేసుకుంటారని సమాచారం. అయితే వీరిద్దరి పెళ్లి అతి త్వరలో జరగబోతుందని అన్ని కుదిరితే జూన్లోనే వీరి పెళ్లి జరుగుతుందని కూడా కొన్ని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అయిన సమంత త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెబుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

 మరి సమంత తన రెండో పెళ్లి వార్తలపై ఇంత గట్టిగా వార్తలు వినిపించినా కూడా మౌనం వహిస్తుందా.. లేక మౌనం పక్కన పెట్టి తన రెండో పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.ఏది ఏమైనప్పటికీ మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పటినుండే సమంత రెండో పెళ్లి వార్తలు వినిపించడంతోపాటు ఫోటోలు కూడా ఎక్కువగా వైరల్ అవ్వడంతో ఇది నిజమేనని చాలామంది భావిస్తున్నారు. మరి చూడాలి సమంత సడన్ సర్ప్రైజ్ ఏమైనా ఇవ్వబోతుందా అనేది.. ఇక సమంత రెండో పెళ్లి వార్తలపై చాలామంది ఫైర్ అవుతున్నారు. అయితే సమంత రెండో పెళ్లి చేసుకోవడాన్ని తప్పు పట్టడం లేదు. కానీ మరొక అమ్మాయి జీవితంలో నిప్పులు పోస్తుంది అని రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంటే ఆయన భార్యకు సమంత అన్యాయం చేసినట్టే అని,శోభిత చేసిన తప్పే మీరు కూడా చేయకండి అంటూ సలహాలిస్తున్నారు కొంతమందిని నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: