టాలీవుడ్ హీరో మాస్ మహారాజు రవితేజ గురించి పరిచయం అనవసరం. హీరో రవితేజ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. అతనే బ్యాక్ గ్రౌండ్ లేని వారందరికీ బ్యాక్ గ్రౌండ్ గా నిలిచాడు. రవితేజ అంటే అభిమానం లేని వారంటూ ఉండరు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. హీరో రవితేజ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే.. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తాను హీరో రవితేజ తో మూడు సినిమాలు చేశారని అన్నారు. మిరపకాయ్‌ ఇచ్చినా, మిస్టర్ బచ్చన్ ఇచ్చినా... రవితేజ అభిమానంలో ఆవగింజంత అయినా తేడా చూపించారని చెప్పుకొచ్చారు. అది రవితేజ గొప్పతనం అని చెప్పొచ్చు. రవితేజ చాలానే సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈయన మిరపకాయ, విక్రమార్కుడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో హిట్ కొట్టి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని పేరు సొంతం చేసుకున్నారు.  

అయితే రీసెంట్ గా తీసిన మిస్టర్ బచ్చన్ లాంటి సినిమా ప్లాప్‌ అయ్యింది. తాజాగా రవితేజ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఎందుకంటే మాస్ మహారాజు కొత్త సినిమా 'మాస్ జాతర' నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మాస్ మహారాజు సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ వింటేజ్ లుక్ లో కనిపిస్తారని మూవీ మేకర్స్ చెప్పారు. మాస్ జాతర సినిమా మంచి హిట్ కొట్టే సినిమా అవుతుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: