
అయితే ఇప్పుడు తాజాగా మంచు మనో ఒక సంచలన ట్విట్ చేయడం జరిగింది. మనోజ్ తన ట్విట్టర్ నుంచి మీ క్యాలెండర్లో ఈ తేదీని మార్క్ చేసుకోండి ది లెజెండ్ దొంగప్ప జూన్ 27న వస్తుంది.. ఇంతకీ రిలీజ్.. జులై 17 లేకపోతే జూన్ 27.. 100 కోట్ల సినిమా మీ కమీషన్ కలుపుకొని.. మూవీ పిఆర్ ప్లానింగ్ కేక అంటూ ఒక ట్విట్ అయితే చేశారు. అంతేకాకుండా ఒక పంది ముఖం ఉన్న మనిషి డబ్బులు దొంగతనం చేస్తూ వెళ్తున్న ఇమేజిని కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ ట్విట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.
మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న రాబోతోంది అంటూ ఇటీవలే అధికారికంగా తెలిపారు.. ఇలాంటి సమయంలోనే దొంగప్ప అని మనోజ్ ట్విట్ చేయడంతో ఇది కచ్చితంగా తన అన్న కన్నప్ప సినిమా గురించే అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు 80% నొక్కేశాడంటూ ఇన్ డైరెక్ట్ గానే ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా తన అన్నకు పోటీగా తన చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలు చేత కన్నప్ప సినిమాని విష్ణు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటీవలే జెల్లీపల్లిలో తమ నివాసానికి వెళ్లి మరి నానా హంగామా చేశారు మనోజ్.