గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది " గేమ్ ఛేంజర్" సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. ఫ్యాన్స్ సైతం తీవ్రంగా నిరాశ చెందారు.. ఈ సారి ఎలాగైనా భారీ హిట్లే కొట్టాలని చరణ్ చూస్తున్నాడు.. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. 

గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది.. ఇదిలా ఉంటే  శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో  చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో వచ్చే చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది..ఇదిలా ఉంటే రాంచరణ్ ‘పెద్ది’ లో ఊహించని సర్ప్రైజెస్ ఉండనున్నట్లు సమాచారం..

ఈ సినిమాలో క్రికెట్ సీన్స్ తో పాటు రెజ్లింగ్ సీన్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.. రాంచరణ్ నట విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు.. దీనితో పెద్ది సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగాయి..ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రికరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.. అలాగే కీలక ఫైట్స్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. రాంచరణ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..చరణ్ బర్త్డే సందర్బంగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: