తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి హృదయ  కాలేయం సినిమాతో మొదటిసారిగా హీరోగా పరిచయమయ్యాడు నటుడు సంపూర్ణేష్ బాబు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ తేరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇప్పటికీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు సందర్భంగా డైరెక్టర్ గడిచిన కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేశారు.. అందులో నా హీరో నా స్టార్ అంటూ సంపూర్ణేష్ బాబుని పొగడ్తలతో ముంచేశారు. అంతేకాకుండా సంపూర్ణేష్ బాబుతో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా పంచుకోవడం జరిగింది.


ఈ ఫోటోలను చూసిన తర్వాత ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఇలా కామెంట్ చేశారు.. మీ స్టార్ ను ఇప్పుడు రోడ్డు మీద వదిలేసావు అంటూ ఒక నెటిజన్ కామెంట్స్ చేయగా.. అందుకు సాయి రాజేష్ ఇలా మాట్లాడుతూ..సోదర ట్రైలర్ విడుదల వేడుకకు హాజరైన సాయి రాజేష్ ఆ కామెంట్స్ ని సైతం గుర్తుచేసుకొని మరి సంపూర్ణేష్ బాబు గురించి తనకు ఉన్న అనుబంధాన్ని మాట్లాడారు. తనకోసం ఎప్పుడు సంపూర్ణేష్ బాబు ఉంటారని సంపూర్ణేష్ బాబు కోసం తాను కూడా ఉంటానని వెల్లడించారు.



తాను సినిమా చేసేందుకు ఏ హీరో దగ్గరికి వెళ్లినా కూడా డేట్స్ ఇవ్వలేదు..నా జీవితమంతా వృధా అనుకుంటున్నా సమయంలోనే సంపూర్ణేష్ బాబుని చూశాను అప్పుడే తన కథలో హీరో అతడే అని ఫిక్స్ అయ్యి మరి ఎంత అప్పు ఉన్న కథల పైన నమ్మకంతో ముందుకు వెళ్లానని తెలిపారు. అయితే సిద్దిపేటలో ఉండే సంపూర్ణేష్ బాబు కథ చర్చలలో భాగంగా వచ్చి వెళుతూ ఉండేవారు.. అలా మొదటి రోజు బస్టాండ్ వద్ద డ్రాప్ చేశాను.. డబ్బులు ఉన్నాయా అని అడగగా? లేవు అని చెప్పారు.. తన వద్ద ఉన్న కొంత డబ్బు ఇచ్చి పంపించాను నేను అసలు సినిమా తీయగలనా? అనే సందేహం ఉన్న సమయంలో ఊహించని విధంగా సినిమా పూర్తి అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సినిమాలకు సంపూర్ణేష్ బాబు బాగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా కారు కొని ఇచ్చారు.. ఇల్లు కొనేందుకు కూడా సహాయం చేశారని తెలియజేశారు సాయి రాజేష్.. సంపూర్ణేష్ బాబు నటించిన సినిమా సోదర ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: