తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం కింద స్టార్ డైరెక్టర్లు ఎవరయ్యా అంటే చాలామంది గుర్తుకు వచ్చేది శ్రీను వైట్ల పేరే.. ఈయన తీసిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో ఈ డైరెక్టర్ తో సినిమా కోసం స్టార్ హీరోలే వేచిచూసేవారు. అలాంటి ఈ దర్శకుడు కామెడీ చిత్రాలు అయితే మరింత అద్భుతంగా తీసేవారు. మహేష్ బాబు దూకుడు చిత్రంతో అద్భుతమైన హిట్ అందుకున్నటువంటి శ్రీనువైట్ల ఆయనతో మరో చిత్రం ఆగడు సినిమా తీసి భారీ ఫ్లాప్ అందుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాఫ్ కి ప్రధాన కారకుడు నేనేనని అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ వల్లే నేను ఆ సినిమాను వదులుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు చూద్దాం. శ్రీను వైట్ల దగ్గర అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా పనిచేసేవారు.

అలా వీరిద్దరి కాంబినేషన్ లో చాలా చిత్రాలు వచ్చాయి. ఇదే సమయంలో మహేష్ బాబుతో ఆగడు సినిమా చేస్తున్నారు. మొదటి భాగం ఫుల్ కామెడీతో  అద్భుతమైన కథాంశాన్ని సృష్టించారు. సెకండాఫ్ కు వచ్చేసరికి  అనిల్ రావిపూడికి డైరెక్టర్ గా పటాస్ సినిమా అవకాశం వచ్చిందట. దీంతో ఆగడు సినిమాపై ఆయన దృష్టి పెట్టలేకపోయానని చెప్పుకొచ్చారు. అలా పటాస్ సినిమాను నేను ఫస్ట్ ఆఫ్ మంచి కామెడీ తర్వాత ఎమోషనల్ క్రియేట్ చేసి అద్భుతమైన సినిమాగా తెరకెక్కించాను. అయితే ఇదే విధంగా ఆగడు సినిమాలో కూడా  మొదటి భాగం ఫుల్ లెన్త్ కామెడీ ఉంది, సెకండాఫ్ కాస్త ఎమోషనల్ ఫైట్ సీన్స్ పెట్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నారట.

 ఈ విషయాన్ని చెప్పడానికి శ్రీను వైట్ల దగ్గరికి వెళ్లేసరికి ఆయన ఆల్రెడీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశానని  చెప్పుకొచ్చారట. దీంతో అనిల్ రావిపూడి తను అనుకున్న విషయాన్ని శ్రీను వైట్ల లాగే చెప్పలేకపోయారట. అలా ఆగడు సినిమా ఫస్ట్ అఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగా లేకపోవడంతో దారుణంగా ఫ్లాప్ అయింది. అనిల్ రావిపూడి కూడా ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారట. నావల్లే శ్రీను వైట్ల సినిమా ఫ్లాప్ అయింది నేను ఆరోజు కాస్త ధైర్యం చేసి నేను అనుకున్న విషయాన్ని చెప్పి ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారట. నేను పటాస్ సినిమా కళ్యాణ్ రామ్ తో తీయడం వల్లే ఆగడు సినిమా ఫ్లాప్ అయిందని  ఆయన చెప్పకనే చెప్పేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: