తెలుగు సినిమా ఇండస్ట్రీ తల రాత మార్చిన నటుల్లో ఎన్టీఆర్ ప్రాముక్యుడు అని చెప్పవచ్చు.. ఆయన ఇండస్ట్రీ లో ఎదుగుతూనే  ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసినా గొప్ప నటుడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  ఇండస్ట్రీని మరింత డెవలప్ చేశారని చెప్పవచ్చు.. ఆయన వల్లే ఇప్పుడు వేలాదిమంది  ఇండస్ట్రీని పట్టుకొని బ్రతకగలుగుతున్నారు. అలా ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో రాజకీయ నాయకుల్లో ఎదురులేని మనిషిగా ఉండేవారు. ఆరోజుల్లో ఎంత పెద్ద దర్శక నిర్మాతలైనా ఎన్టీఆర్ ను నిలవరించేవారు కాదు. కానీ ఎన్టీఆర్ ను  ఆయన ఒక్కరు మాత్రమే ఏదైనా మాట్లాడి బెదిరించేవారు. ఆయన ఎవరో కాదు ఎన్టీఆర్ కుమారుడు  హరికృష్ణ.

 ఈయన చిన్నతనంలో చాలా తుంటరి పనులు చేసేవాడట. హరి కృష్ణ చేసే అల్లరి వల్ల  ఆ హీరో తండ్రి హరి కృష్ణను ఏమనలేక తన కొడుకును తరచూ కొట్టేవాడని తెలుస్తోంది.. ఆ హీరో ఎవరో వివరాలు చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రాజేంద్రప్రసాద్. ఈయన చిన్నతనంలో ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లోనే అద్దెకు ఉండేవారట. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్  సినిమాల్లోకి వచ్చేవరకు ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే ముడి వేసుకొని ఉన్నారట.  

అయితే చిన్నతనంలో హరికృష్ణతో ఆడుకునే సమయంలో హరికృష్ణ చేసే అల్లరికి మా నాన్న తట్టుకోలేక హరికృష్ణని ఏమనలేక నన్ను కొట్టేవారని తాజాగా రాజేంద్రప్రసాద్ రాబిన్ హుడ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు తాను సినిమాల్లోకి రావడానికి ఆదర్శం కూడా ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఆయన హీరోగా రాణిస్తున్న టైం లోనే నేను కూడా మద్రాసుకి వెళ్లిపోయానని, అక్కడ యాక్టింగ్ స్కూల్లో చేరి యాక్టింగ్ నేర్చుకున్నానని, ఆ తర్వాత మెల్లిమెల్లిగా సినిమాల్లోకి వచ్చి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: