చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది తక్కువ కాలంలో ఫేమస్ అవుతుంటే మరి కొంతమంది కాస్త ఆలస్యంగా... దుమ్ము లేపుతారు. అయితే.. అతి తక్కువ కాలంలో ఫేమస్ అయిన హీరోయిన్లు కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. కన్ను కొట్టి కుర్రకారులు మొత్తం తన వైపు తిప్పుకుంది ఈ ప్రియా ప్రకాష్ వారియర్.

 ఓ సాంగ్ లో భాగంగా కన్నుగిట్టిన... ప్రియా ప్రకాష్ వారియర్ వీడియో... అప్పట్లో తెగ హల్చల్ చేసింది. దీంతో వైరల్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అవకాశం వచ్చింది. ఓర్ ఆధార్ లవ్  అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ కన్ను గీటు భామ ప్రియా ప్రకాష్.  ఈ సినిమా జనాలకు పెద్దగా నచ్చకపోయినా.. ప్రియా ప్రకాష్ కు మాత్రం మంచి అవకాశాలను తీసుకువచ్చింది.

 ఇటు తెలుగులో కూడా ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. టాలీవుడ్ తెలుగు హీరో నితిన్ హీరోగా చేసిన చెక్ సినిమాలో.. ఈ అందాల తార ప్రియ ప్రకాష్ వారియర్ నటించింది. దురదృష్టవశాత్తు ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళ బ్యూటీ... కన్నడ హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో.

 ఈ బ్రో సినిమాలో హీరోయిన్ గా కాకుండా  సాయి ధరంతేజ్ చెల్లెలుగా కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ బ్యూటీ కి మాత్రం అవకాశాలు రాలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగులో పెద్దగా సినిమాలు చేసిందే లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియా ప్రకాష్ వారియర్.. గుడ్ బ్యాడ్ ఉగ్లీ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇందులో కాస్త హాట్ గానే కనిపించింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: