ఒక సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన పాటలు బాగా హిట్ అయితే అతడికి ఎక్కువగా అవకాశాలు రావడం పరిపాటి. అయితే అతడు సంగీత దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడ విడుదల కాకుండా కేవలం 21 సంవత్సరాలు వయస్సు ఉన్న ఒక యువకుడుకి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతూ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.



ఆ అబ్బాయి పేరు సాయి అభ్యంకర్ అనేక సినిమాలకు అతడు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమాలు అనీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో త్వరలో మొదలుకాబోతున్న మూవీకి ఇతడు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.



ఈ సినిమాతో పాటు సూర్య 45వ సినిమా . లోకేష్ కనగరాజ్ కథతో లారెన్స్ హీరోగా రూపొందుతున్న బెంజ్’బెంజ్’ కి కూడ ఇతడు సంగీత దర్శకుడుగా ఎంపిక అయ్యాడు. ఈ మూవీలతో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాధన్ నటిస్తున్న మూవీ కూడ ఇతడి కంపోజింగ్ లోనే పాటలు ట్యూన్ కాబోతున్నాయి. ఈసినిమాలు కాకుండా తమిళ హీరో శింబు నటిస్తున్న 49వ సినిమాకు కూడ ఇతడే సంగీత దర్శకుడు అని అంటున్నారు.



ఈ రేంజ్ లో ఇతడి క్రేజ్ ఇలా ఉండటానికి గల కారణం ఇతడు ఇప్పటికే కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా అతను చేసిన కంపోజింగ్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈఅబ్బాయి తల్లి తండ్రులు టిప్పు హరిణి ఒకప్పుడు టాప్ సింగర్స్ తమిళం తెలుగులో వీళ్ళు చాలా పాటలు పాడారు. ముఖ్యంగా 2000 నుంచి 2010 మధ్య వీరి హవా కొనసాగింది. తల్లి తండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన టాలెంట్ తో ఇప్పుడు యూత్ లో ఇతడు క్రేజీ సెలెబ్రెటీగా మారిపోయాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: